ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ తయారీ యూనిట్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెయ్యి కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లో ఈవీ బ్యాటరీ యూనిట్ స్థాపిస్తున్నారని, ఈ పరిశ్రమ ఏర్పాటుతో చుట్టుపక్కల వారికి ఉపాధి లభిస్తుందన్నారు. టీఎస్ ఐపాఎస్ తో ఎవ్వరికీ లంచం ఇవ్వకుండా పరిశ్రమల కు పర్మిషన్ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. భారతదేశంలోనే తెలంగాణ పారిశ్రామిక రంగంలో అవినీతి రహితంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూడాలని మహీంద్రా సంస్థ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. మనం ఇంట్లో కూర్చొని ఉంటే మన దగ్గరికి ఉద్యోగాలు రావని ఆయన అన్నారు.
Also Read : Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
జహీరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందని, అందుకే ఎలక్ట్రిక్ పాలసీని సపోర్ట్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో కార్ల రేసింగ్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో పెట్టామని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పాము. మూడు లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. 20లక్షల మందికి ఉపాధి అవకశాలు లభించాయని తెలిపారు. కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలని సూచించారు కేటీఆర్.
Also Read : Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్