Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Operation Kaveri To Evacuate Citizens From Sudan Begins: సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలతో సూడాన్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచారు. అలాగే.. సూడాన్ తీరంలోనూ ఐఎన్‌ఎస్ సుమేధను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించిన భారత్.. దీనికి ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా.. ఆల్రెడీ సుడాన్ తీరానికి 500 మంది భారతీయులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘మా నౌకలు, విమానాలు సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మన భారతీయ సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
కాగా.. వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, అలాగే ఐఎన్ఎస్ సుమేధ భారతీయుల్ని తరలించడానికి సుడాన్ పోర్ట్‌కు చేరుకుందని ఆదివారం భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే! పౌరుల తరలింపు ప్రకటన వచ్చిన వెంటనే.. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ పౌరులతో పాటు భారతదేశం సహా మొత్తం 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. గత వారం సుడాన్‌లో కాల్పులు జరిగినప్పుడు.. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ సిబ్బందిలోని ముగ్గురు భారతీయుల్ని సౌదీ అరేబియాకు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున.. భారతీయ పౌరులతో సహా మొత్తం 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్‌కు తరలించడం జరిగింది. ‘‘ఫ్రెంచ్ తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి రెండు సైనిక విమానాల రొటేషన్లు.. భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని తరలించాయి’’ అని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
అటు.. ఆపరేషన్ కావేరిని ప్రారంభించడానికి ముందు.. భారత పౌరుల తరలింపు ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ విదేశాంఖ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నామని.. వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచామని, ఐఎన్‌ఎస్ సుమేధ సూడాన్ పోర్టుకు చేరుకుందని తెలిపింది. అయితే, రాజధాని ఖార్తూమ్‌తోపాటు ఆయా ప్రాంతాల్లో భీకర ఘర్షణలు సాగుతున్నాయని, తద్వారా తరలింపు ప్రణాళికలన్నీ క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు