Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నవీన్.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్నాడు. ఇక జాతిరత్నాలు సమయంలో ఈ జాతిరత్నం చేసిన హంగామా అంతా ఇంత కాదు. సంగారెడ్డి కుర్రాడు అంటూ ప్రభాస్ తో చేసిన రచ్చ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక జాతిరత్నాలు తరువాత నవీన్ ‘అనగనగ ఒక రాజు’అనే సినిమాను ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
ఇక ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు నవీన్ పుట్టినరోజుకు స్పెషల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ సరసన శ్రీలీల నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఈ టీజర్ రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తోంది. ఇప్పటివరకు ఈ సీనియాకు సంబంధించిన ఒక్క అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందా..? లేదా..? అనే కన్ఫర్మేషన్ కుడా లేదు. ప్రస్తుతం నవీన్.. యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్నాడు. అనుష్క- నవీన్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. మరి ఆ రాజు పరిస్థితి ఏంటి.. నవీన్ బ్రో .. కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఈ విషయం క్లారిటీ ఇస్తావా..? అంటూ అభిమానులు అడుగుతున్నారు. మరి ఈ జాతి రత్నం ఏమైనా రిప్లై ఇస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
Tiny Holes in Clothes: అల్మారాలోని బట్టలకు చిన్న రంధ్రాలా? ఎలుకలు కాకపోవచ్చు.. ఈ కీటకాలతో జాగ్రత్త!
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..