తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఫరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందన్నారు. రాజకీయాల్లో ఇలాంటి నీచత్వాన్ని చెత్తను ఎండగట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు.
శశిధరూర్ గాడిద అన్న రేవంత్ మాటల పైన సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ జాతీయ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మనీష్ తివారి కోరారు. రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమో అని శశిధరూర్ అన్నారు.
తెలంగాణలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రశంసించిన ఐటి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయిన యంపి,మాజీ కెంత మంత్రి శశిధరూర్ పై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా సెగ గట్టిగానే తాకుతుంది.
రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుంది అంటూ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. రేవంత్ రెడ్డిలాంటి నిచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి శశిథరూర్ పైన చేసిన ఆడియోను ట్వీట్ చేశారు. ఈ ఆడియో తనకు ఒక మీడియా మిత్రుడు పంపించారన్న కేటీఆర్, ఈ ఆడియోను ఫోరెన్సిక్ కి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి వాయిస్ తో కచ్చితంగా మ్యాచ్ అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన రాహుల్గాంధీ ఏమైనా స్పందిస్తారా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పైన నోరు పారేసుకోవడం పై అటు రాష్ట్రంలోని పలువురితో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చురకలు అంటిస్తూన్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత, అధిష్టానానికి అత్యంత దగ్గరైన మనీష్ తివారి రేవంత్ రెడ్డికి గట్టిగానే బుద్ధి చెప్పారు. శశిధరూర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడని, ఆయన నీకు నాకు అలాగే అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. వెంటనే రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.
మరోవైపు శశిధరూర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. బహుశా రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొని గాడిద ఆనే మాట అన్నారేమో అని స్పందించారు. తాము ప్రచురించిన వార్తాకథనం లో ఏ మాత్రం ఆవాస్తవం లేదని తమ వద్ద ఖచ్చితమైన ఆధారం ఉందని, తమ వార్తాకథనాన్ని కి కట్టుబడి ఉన్నామని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది వైపు వందలాది మంది శశిధరూర్ అభిమానులు, రేవంత్ రెడ్డి గత చరిత్రను కేసులను ఎత్తిచూపుతూ తీవ్రంగా ట్వీట్లు చేస్తున్నారు.
While scumbags like @revanth_anumula need not be responded to; it’s important to expose filth
— KTR (@KTRBRS) September 16, 2021
Here’s his audio clip/comments on Tharoor. Sent to me by a reporter
I am sure if we send it to a forensic lab, it’ll match his infamous #Note4Vote voice
Any comments @RahulGandhi Ji? https://t.co/cdDHrAZ8QL pic.twitter.com/5Ly2mTOgpz