Minister KTR: మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా.. కూతురు పుట్టాక జీవితం మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మా అమ్మ ని చూసి చాలా నేర్చుకున్నానని.. తన కూతురు పుట్టాక జీవితం చాలా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో ఫ్యూచర్ ఫార్వార్డ్ తెలంగాణలో భాగంగా “విమెన్ అస్క్ కేటీఆర్” ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉండటం వల్ల మా నాన్న ప్రభావం నాపై చిన్నప్పుడు ఎక్కువ ఉండేది కాదని అన్నారు. మా అమ్మని చూసి నేను చాలా నేర్చుకున్నానని కేటీఆర్ తెలిపారు. తన భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది .నా చెల్లి చాలా డైనమిక్ . నా కుటుంభంలోనే తనంత ధైర్యవంతులు లేరన్నారు. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుందని, కూతురు పుట్టాక నా జీవితం చాలా మారిందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకార్లుల్లో ఎక్కువ మంది మహిళలే అని మంత్రి అన్నారు. మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించామన్నారు.
ప్రతి చిన్నారి పై 10వేలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ లు 61% కి పెరిగాయన్నారు. మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించామన్నారు. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలలో మహిళలు స్త్రీ నిధి లోన్ లను మహిళలు 99 శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. ఆ లోన్ తో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేసాము ఇంకా చేయాల్సిన ఉన్నాయని తెలిపారు. మహిళా యూనివర్సిటీ , కల్యాణ లక్ష్మీ , అమ్మఒడి సేవలు వంటివి తెచ్చామని గుర్తు చేశారు. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. సుల్తాన్ పూర్, నందిగామసహా మొతం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసామన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామన్నారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
- Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
- Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ఫేక్ డీపీ మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే అన్నారు. మా ప్రత్యర్థులు ఫేక్ డిపి వాడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్ గా తయారవుతోందని తెలిపారు. మా ప్రతిపక్షాలు మాపై సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్సార్ తో కల్సిసి సైబర్ క్రైమ్ లేజిస్లేషన్ తయారు చేస్తున్నామన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదన్నారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నామన్నారు. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి పక్షాలకు కూడా మేమే గెలుస్తామని తెలుసు కానీ వాళ్ళు నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అజెండా మీరే తయారు చేయండి అని తెలిపారు. అమలు చేయడానికి ప్రయత్నిద్దామన్నారు. రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా.. అన్నారు. రక్షణ పరంగా ఇప్పటికే షి టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు.
Current Bill : ఈ చిన్న అలవాట్లను మార్చుకుంటే చాలు.. కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది..
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!