చాలా మందికి పవర్ తక్కువగా వాడిన కూడా ఎక్కువ బిల్ వస్తుందని తెగ ఫీల్ అవుతుంటారు.. మేము తక్కువగా వాడిన ఇంత బిల్ వేశారేంటి అంటూ అధికారులతో గొడవలకు దిగుతున్న సందర్భాలను అనేకం చూసాము.. నిజానికి కరెంట్ బిల్ ఎక్కువగా రావడానికి మీరు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే కారణం. వీటిని గమనించి సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. అయితే అలాంటి పొరపాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
రూమ్ లలో మనుషులు ఉన్నా లేకున్నా లైట్, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది.. ఇది వృధానే కదా.. దాంతో బిల్ ఎక్కువగా వస్తుంది.. కారణం లేకుండా ఇంట్లోని గృహోపకరణాలు నడిపించవద్దు. ఉపయోగంలో లేనప్పుడు రిమోట్‌తో టీవీ వంటి వాటిని ఆఫ్ చేయాలి.. ఇక కొత్త ఎలెక్ట్రానిక్ వస్తువును కొన్నప్పుడు దాని మీద ఉండే స్టార్ ను తప్పక గమనించాలి.. ఆ వస్తువు శక్తి సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రమాణం. అధిక స్టార్ రేటింగ్ ఉన్న వస్తువు శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ విద్యుత్‌ని వినియోగిస్తుంది..
ఇక మీరు ఇంట్లో ఎల్ఈడి బల్బులనే వాడటం మంచిది.. పాత రకాల బల్బుల కంటే చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. విద్యుత్ వినియోగంలో 75% వరకు ఆదా చేయవచ్చు. అంటే ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లులో చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్రిజ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అది తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక ప్రిడ్జ్ రీడింగ్ కూడా 7 ఉండేలా చూసుకోవడం మంచిది.. ఇక మీరు ఏసీ వాడుతున్నట్లయితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంచినట్లయితే అది ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అంత చల్లదనం మీ శరీరానికి హానిని కలిగిస్తుంది. ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది.. బిల్లు కూడా తక్కువగా వస్తుంది..