Minister KTR: అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కేటీఆర్ సమీక్ష.. అవసరమైతే చట్టాలను మార్చాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సమీక్ష చేపట్టారు మంత్రి కేటీఆర్.. అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు.. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరలు పాల్గొన్నారు.. పలు ప్రతిపాదనలు, సూచనలు చేశారు మంత్రులు.. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలలో భారీ/ ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలని సూచించారు కేటీఆర్.
Read Also: Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
హైదరాబాద్ లో వస్తున్న భారీ అంతస్తుల భవన నిర్మాణాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు కేటీఆర్.. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతుల పైన అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు.. ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని.. ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సామాగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.. అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు.. ఇక, ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!