Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్ రాగానే ఈటల రాజేందర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని చిరునవ్వుతో పలకరించుకున్నారు. స్వయంగా ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్ గత సమావేశాల్లో చాలా సేపు మాట్లాడారు. చాలా కాలంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్ కూడా రాలేదు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత సమావేశాల్లో అనూహ్యంగా కేటీఆర్, ఈటల పలకరించడం చర్చనీయాంశమైంది. తాజా సమావేశాల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. ఈటెలకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆయన సతీమణి జమున స్వయంగా వ్యాఖ్యానించడంతో.. తానే స్వయంగా భద్రత కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ బంధం మరింత దృఢమైందని, తాజా సమావేశాల్లో గతం కంటే ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనమని గులాబీ నేతలు అభిప్రాయపడ్డారు.
Read also: Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిచంద్ కు సభ నివాళులర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయం లేని లోటు తీర్చలేమన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో విలీనం చేసేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. సాయన్న అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతికి సంతాపం తెలుపుతూ సభా వేదికపై ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సాయన్న మృతికి శాసన సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ రేపటికి (శుక్రవారం) వాయిదా పడింది.
Bandi Sanjay: తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి.. బండి సంజయ్ తో ప్రధాని మోడీ
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!