KTR: నేడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు కావడంతో ప్రచారంలో పోలిటికల్ హీట్ పెరిగింది. ఇవాల సాయంత్రం 6 గంలకు ప్రచారం మునుగోడు ప్రచారం ముగియనుంది. దీంతో ఇవాళ మంత్రి కేటీఆర్ రోష్ నిర్వహించారు. ఎమ్మెల్యే పైకి పోతే ఉపఎన్నిక వస్తుంది కానీ ఇక్కడ అమ్ముడు పోతే వచ్చిందని మంత్రి కేటీఆర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణ పూర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ రోడ్ షోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రోడ్ షోలో కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్యే పైకి పోతే ఉపఎన్నిక వస్తుంది కానీ ఇక్కడ ఉపఎన్నిక మాత్రం అమ్ముడు పోతే వస్తుందని తెలిపారు. ఆయన అమ్ముడు పోయింది 18వేల కోట్ల కాంట్రాక్టు? కాంట్రాక్టర్ మదంతో ఈ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు.
Read also: Gudivada Amarnath: జనసేన క్యాడర్ చంద్రబాబుకి బానిసలా?
తులం బంగారం ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తున్నాడు రాజగోపాల్ అంటూ మండిపడ్డారు. గ్యాస్ ధర భారీగా కేంద్రం పెంచిందని అన్నారు. ప్రతిదీ రెట్లు పెరిగి సామాన్యుడి జీవితం దుర్బరం అయ్యిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పెరగడానికి మోడీ కారణమని, పైసలు పడేసి కొంటానని చూస్తోంది బీజేపీ అని ఆరోపించారు. ఫ్లోరోసిస్ సమస్యతో మునుగోడు బాధ పడిందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి ఇచ్చారని.. కానీ ఇన్నేళ్లలో మిగితా వాళ్ళు ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఆలోచన చేయండి మీరు అంటూ మంత్రి అన్నారు. ఎవడో వచ్చి మందు పోస్తాం, డబ్బులు ఇస్తాం అంటే చేసేది ఏమి ఉండదని విమర్శించారు. ఇంకా 14 నెలల ప్రభుత్వం మనది ఉంది, అద్భుతంగా మునుగోడు అభివృద్ధి చేసుకుందాం మని కేటీఆర్ పిలుపు నిచ్చారు.
Rajagopal Reddy: సెకెండ్ హ్యాండ్, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకొద్దు.. అర్ధరూపాయి పెట్టిన ఎవరు కొనరు