Minister Harish Rao Talks About ST Reservations: తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వాలని మేము కూడా కొట్లాడుతున్నామని, ఢిల్లీలో మన ఎంపీలు పోరాటం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఎస్టీలకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామని తెలియజేశారు. సంగారెడ్డి నారాయణఖేడ్‌లోని ఎడ్ల రేగడి తాండలో కల్లుబాబా దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గతంలో కరెంటు సరిగ్గా ఉండేది కాదని, దాంతో వ్యవసాయానికి కష్టం అయ్యేదని అన్నారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం 24 గంటలు కరెంటుతో పాటు ఎకరానికి వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. రైతు భీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ.. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంటి అడుగుజాగాలో ఇల్లు కట్టుకునే వారికి.. త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Boinapally Vinod Kumar: పుట్టగతులు ఉండవనే.. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి
అంతకుముందు.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. దేశంలో రోజుకి 4వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతోనే ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్ అరెస్ట్ అని, అప్పుడు చేసేదే సీపీఆర్ అని తెలిపారు. అయితే, ఈ సీపీఆర్‌పై కేవలం 2 శాతం మందికే అవగాహన ఉందని, 98 శాతం మందికి అవగాహన లేకపోవడంతో చాలామంది కార్డియక్ అరెస్టుతో చనిపోతున్నారని తెలియజేశారు. అందుకే.. కార్డియాక్ అరెస్టుపై అవగాహన కలిపిస్తున్నామన్నారు. సీపీఆర్ చేయడానికి పెద్ద చదువు అవసరం
లేదని, అవగాహన ఉంటే చాలని చెప్పారు. అన్ని శాఖల సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇస్తున్నామన్నామన్నారు. సీపీఆర్ కాకుండా AED పరికరంతో కరెంట్ షాక్ ఇచ్చి కూడా ట్రీట్‌మెంట్ చేస్తారన్నారు. రూ.1500 కోట్లతో 1200 AED మిషన్లను కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
Mother Kills Daughters: మాజీ భర్తపై పగతో.. ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన మహిళకు శిక్ష