ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ చేయడం లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. ఈ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ‘గీత ఆర్ట్స్’ కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాని ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి కాష్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలని ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు దిల్ రాజు, అల్లు అరవింద్ బాటలో ‘యువీ క్రియేషన్స్’ కూడా నడుస్తున్నారు. భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ‘యువీ క్రియేషన్స్’ ఒక తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కనెక్ట్’ సినిమా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ లాంటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సినిమాలని తెరకెక్కించిన ‘అశ్విన్ సరవనన్’ ‘కనెక్ట్’ సినిమాకి దర్శకత్వం వహించాడు. కరోనా సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా… దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్న తన కూతురిని నయనతార, అనుపమ్ ఖేర్ సహాయంతో కూతురిని ఎలా కాపాడుకుంది? అనే కథతో ‘కనెక్ట్’ సినిమా తెరకెక్కింది. సత్యరాజ్ ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. నయనతార భర్త ‘విజ్ఞేశ్ శివన్’ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని తెలుగులో ‘యువీ క్రియేషన్స్’ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ నిడివి 95 నిమిషాలే కావడంతో, థియేటర్స్ లో రిలీజ్ చేయడం కన్నా ఒటీటీలో రిలీజ్ చేయడం బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.