Flyovers closed in Hyderabad: హైదరాబాద్‌లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్‌విఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్‌లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి. ‘షబ్-ఏ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్డు, పీవీఎన్‌ఆర్ రోడ్డులో వాహనదారులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రజలు, వాహనదారులు ప్రకటన విడుదల చేశారు. ఏమైనా సమస్యలుంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు సంప్రదించాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఫ్లైఓవర్‌లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆంక్షలను పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read also: Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
‘షబ్-ఎ-ఖదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కానీ చంద్రుని దర్శనం ప్రకారం, అమావాస్యను బట్టి ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో రంజాన్ పండుగను జరుపుకునే అవకాశం ఉంది.పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లిం సోదరులు ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఐపీఎల్ టోర్నీ..
మరోవైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్జీసీ వైపు మళ్లిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే అభిమానులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. అలాగే స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో, టీఎస్‌ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదనపు సర్వీసులు నడుస్తున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్