సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రెండుకోట్ల యాభై లక్షలు ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ కు కేటాయించడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభింఛడం జరిగింది,మరో 16 సెంటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయనున్నారు. ఈ వ్యాది నిర్ధారణ కేంద్రాలు పేదలకు ఎంతో ఉపయోగకరం కానున్నాయి. పేదలు పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో త్వరలో రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించనున్నాం. జిల్లా ఆసుపత్రిలో రెండుకోట్ల వ్యయంతో సి.టి.స్కాన్ ను ఏర్పాటుచేయనున్నాం. 550 కోట్లతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల మంజూరు చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 100 సీట్ల నర్సింగ్ కళాశాల మంజూరైంది అని పేర్కొన్నారు.