Airbus Beluga : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాదులో ల్యాండైంది. తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా విమానం కోల్‌కతాలోని జాయ్ సిటీ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆ తిమింగలం ఆకారంలోని ఎయిర్‌బస్ బెలూగా మన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ విమానానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. ఎయిర్ బస్ బెలూగా గత రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్ కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విమానం రాత్రి 7.20 నిమిషాల వరకు హైదరాబాదులోనే ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల్లో ఒకటైనా దీనిని సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. 56 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం ఫోటోలను తీసిన పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారీతనానికి మారుపేరుగా నిలిచే ఏఎన్ ఆంటోనోవ్ కార్గో విమానం కూడా 2016లో ఇక్కడి విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండైంది. తమ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, భారీ విమానాలు సైతం సాఫీగా ల్యాండవడం అందుకు నిదర్శనమని ఎయిర్ పోర్టు నిర్వహణ వర్గాలు వెల్లడించాయి.
#Hyderabad Airport saw a Unique visitor last night, One of the World's largest #CargoAircraft, whale shaped #AirbusBeluga reached at #RGIA , #GMR Hyderabad Airport were made special arrangements for its landing, parking and take-off. pic.twitter.com/puraiuil21
— shinenewshyd (@shinenewshyd) December 5, 2022