Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Errabelli Dayakar Rao Fires On Telangana Bjp Leaders Over Mission Bhagiratha Award Issue

Errabelli Dayakar Rao: ఢిల్లీలో అభినందనలు.. గల్లీల్లో బీజేపీ నేతల పిచ్చిపిచ్చి కామెంట్లు..!

Published Date :October 3, 2022 , 1:33 pm
By Sudhakar Ravula
Errabelli Dayakar Rao: ఢిల్లీలో అభినందనలు.. గల్లీల్లో బీజేపీ నేతల పిచ్చిపిచ్చి కామెంట్లు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి రాష్ట్రంలోని బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేంద్ర నాయకత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను అభినందిస్తుంటే.. గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.. మమ్మల్ని పొగుడుతున్న కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడి బీజేపీ నాయకులు తిట్టాలి అంటూ సలహా ఇచ్చారు. మిషన్‌ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి షెకావత్‌.. మిషన్‌ భగీరథను అభినందించారని గుర్తుచేశారు.. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్వచ్ఛ పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు, అధికారులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు.

Read Also: Kishan Reddy: పీకేని కేసీఆర్‌ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!

ఇక, మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడం గర్వకారణం అన్నారు మంత్రి ఎర్రబెల్లి.. అందరి కృషితోనే మిషన్‌ భగీరథ విజయవంతమైందన్న ఆయన.. పల్లె ప్రగతి పనుల వల్లే 14 కేంద్ర అవార్డులు వచ్చాయన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాగునీటి కోసం మహిళలు ఎన్నో కష్టాలు పడేవారు.. బిందులు తీసుకుని కొన్ని కిలోమీటర్లు నడిచేశారు.. ఏ నీరు దొరికితే ఆ నీటినే తాగే పరిస్థితి ఉండేదని గుర్తుచేసిన మంత్రి.. ఇప్పుడు ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.. మరోవైపు.. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని తెలిపారు. అన్ని పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తుందని కొందరు అంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఎంత ఇస్తే అంత డబ్బులు రాష్ట్రం ఇస్తుందని గుర్తుచేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Minister Errabelli Dayakar Rao
  • Mission Bhagiratha Award
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions