మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి చెందుతున్నాయి. వర్గల్ (మం) మజీద్ పల్లి గ్రామంలోని పౌల్ట్రీఫామ్ లో రెండ్రోజుల్లో 10 వేల కోళ్ల మృత్యువాత పడ్డాయి. వెటర్నరీ అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. ఏ రోగంతో చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే కోళ్ల మృతిపై…
మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు. ఉదయం నుంచి కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి.
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
Bird Flu : తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్‌లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం , మంగళవారం రోజుల్లోనే దాదాపు 5 వేల కోళ్లు అకస్మాత్తుగా…