బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా భాగం కాబోతున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ మూవీపై అన్ని వర్గాల్లో ఆసక్తి ఉంది. ఇక ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read : Nara Lokesh : ‘పుష్ప’ మూవీ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్..
అయితే తాజా సమాచారం ప్రకారం ముంబైలో ఈ మూవీకి సంబంధించి ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిస్తుంది. అది కూడా యష్ ఇంకా రణబీర్ కపూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారట. ఇక తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే స్టార్ట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్‌లో యష్ తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. రామాయణం మీద సినిమా అంటే సవాల్ తో కూడుకుంది. ఎందుకంటే ఇప్పటికే రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆదిపురుష్’ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓం రౌత్ . అతను రామాయణం చూపించిన విధానం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. అందుకే ఇలాంటి చిత్రాలు ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి నితేష్ తివారీ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.