Warangal Crime: క్షణాల్లో హత్యలు జరుగుతున్నాయి. గతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉంటే.. ముందస్తు ప్రణాళికతో హత్యలు చేస్తూ ముందుకు సాగేవారు. ఇప్పుడు క్షణికావేశంలో చంపేస్తున్నారు. చిన్నచిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి ఎదుటి వారికి పై దాడికి దిగుతున్నారు. అగ్గిపెట్టి కోసం ఇరువర్గాలు కొట్టుకుని ప్రాణాలు తీసేందుకు తెగబడిన ఈ ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలో కొలన్ పెల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అగ్గిపెట్ట కోసం రెండు వర్గాలకు చెందిన యువకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త కొట్టుకునేంత వరకు దారితీసింది. ఓ వర్గం చెందిన యువకుడు బీరు సీసాతో తలపై బాధడంతో భేతి రామ్ చరణ్ (17) స్పృహ తప్పిపడిపోయాడు. అపస్పారక స్థితిలో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి రామ్ చరణ్ మృతి చెందాడు. మృతుడు పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన భేతి శోభా, వెంకటేష్ కుమారుడు రామ్ చరణ్ గా గుర్తించారు.
సంక్రాంతి పండుగ సెలువులలో అమ్మమ్మ ఇంటికి రాయపర్తి మండలం కోలన్ పల్లికి రామ్ చరణ్ వచ్చాడు. వరంగల్ లోని ఓ కళాశాలలో రామ్ చరణ్ ఇంటర్మీడియట్ అవుతున్నాడు. రామ్ చరణ్ మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కేవలం అగ్గిపెట్టి కోసమేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలురు మద్యం సేవించి ఇంతగా తెగబడుతున్న ఎవరు ఆపకపోవడం గమనార్హం అన్నారు. జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలోని యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు.
Nallapareddy vs Nallapareddy: మా అన్నకు సీటు ఇవ్వొద్దు..! సీఎం జగన్‌కు ఎమ్మెల్యే నల్లపరెడ్డి సోదరుడి ఫిర్యాదు.. ఆడియో వైరల్..