Maoist Party Gives Clarity On Hidma Death News Via Letter: ఇటీవల ఛత్తీస్‌గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా మావోయిస్టు పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడుదలైన ఈ లెటర్లో.. మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిడ్మా మరణవార్తను ఖండించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ పోలీసులు హిడ్మాను హతమార్చినట్లు దేశమంతా ప్రచారం చేశాయని.. అయితే బస్తర్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో భద్రతా బలగాలు అనుకుంటున్నట్లు ఏమీ జరగలేదని స్పష్టం చేశారు.
IND vs SL 2nd ODI: శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం
భద్రతా బలగాలు దాడులకు దిగింది నిజమేనని.. కానీ అందుకు ధీటుగా మావోయిస్టులు తిరగబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనవసరపు దాడులతో ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దేశ రక్షణ కోసం ఉండాల్సిన భద్రత.. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో మోహరిస్తున్నారని సెటైర్ వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విలువైన సంపద ఛత్తీస్‌గఢ్ ఆటవీ ప్రాంతలో ఉందని, ఈ విలువైన సంపదను దోచుకునే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన సంపదను మావోయిస్టు పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందన్నారు. మొత్తం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంప్‌గా మార్చేశారని.. నిత్యం దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఏకంగా వైమానిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆ లేఖలో వెల్లడించారు.
Global Warming: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబుకే వార్నింగ్
కాగా.. కొంతకాలం నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులతో కలిపి సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం భద్రతా బలగాల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా మకాం వేసినట్లు బలగాలకు సమాచారం అందడంతో.. అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హిడ్మా హతమయ్యాడని బుధవారం పెద్దఎత్తున ప్రచారం జరిగింది. హిడ్మా మృతి వార్తలను పోలీసు ఉన్నతాధికారులు సైతం రాత్రి వరకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే తాజాగా లెటర్ ద్వారా హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడని మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది.