Global Warming: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబుకే వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది. 19వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుండి అత్యంత వేడి నమోదైన ఐదవ సంవత్సరంగా 2022 నిలిచింది. ఎల్‌నినో ఏర్పడడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు.
Read Also: Harassment : ‘నా మొగుడు.. నా పళ్లు ఊడగొట్టాడు’.. పరిహారం కోసం కోర్టుకెక్కిన మహిళ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
2022 చివరి రెండు నెలల్లో అత్యంత వేడి నమోదైంది. ఈ నెలల్లో, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ కూడా 2022లో వేడి రికార్డులను బద్దలు కొట్టాయి. ఐరోపాలో, వాతావరణ ఉష్ణోగ్రత రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి 2022.. రెండవ అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా ఉంది. యూరప్‌లో 30 ఏళ్లలో ప్రపంచ సగటుతో పోలిస్తే రెట్టింపు ఉష్ణోగ్రతలు పెరిగాయి. చైనా, పశ్చిమ ఐరోపాలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం వ్యవసాయ రంగం, నీటి సరఫరా, ఇంధన ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది.
Read Also: Russia Ukraine War: సోలెడార్‌ను ఆక్రమించామంటున్న రష్యా.. నీకంత లేదన్న ఉక్రెయిన్
భూమి యొక్క ధ్రువ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. తూర్పు అంటార్కిటికాలో గత 65 ఏళ్లలో ఉష్ణోగ్రతలు 17.7 డిగ్రీల సెల్సియస్‌తో 2022 అత్యంత వెచ్చని సంవత్సరంగా ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా గ్రీన్‌లాండ్‌లోని మంచు పలకలు కూడా కరిగిపోతున్నాయి. ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదలకు కూడా దారితీసింది. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు ఇప్పుడు అధిక స్థాయిలో ఉన్నాయి. గత ఏడాది ఒక దశాబ్దంలో అత్యధిక ప్రపంచ ఉద్గారాల రేటును చూసింది. ఈ ఏడాది కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!