Maoist Leader Hidma: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. కేవలం 50 ఇళ్లున్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇళ్లు మూతపడగా.. గ్రామస్థులు భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి…
ఇంటెలిజెన్స్ నుంచి రెండు రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చింది.. మావోయిస్టు నేతలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని చూశారు. కానీ, ఇవాళ ఉదయం మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర వెల్లడించారు.