మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు దాటేందుకు ప్రయత్నించాడు. వెంటనే అది కదలడంతో.. ఎటు వెళ్లాలో అర్థం కాక పట్టాల మధ్యలో పడుకున్నాడు. దీంతో ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లినప్పటికి అతడికి ఏమి కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Mouse Turned Girl: రాత్రికి రాత్రే అమ్మాయిలా మారిన ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ వద్ద ప్లాట్‌ఫామ్ అవతలి వైపుకు గూడ్స్ రైలు కిందకు దిగడానికి ప్రయత్నించిన వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు . రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఆగి ఉంది ఈ క్రమంలో ఎప్పటిలాగే రైలు పట్టాల కింద నుండి దూరి అవతల వైపు వెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారిగా ట్రైన్ మూవ్ కావడంతో ఏం చేయాలో అర్థంకాక.. పట్టాలపై బోర్లా పడుకున్నాడు. దీంతో ట్రైన్ అతడిపై నుంచి వెళ్లినా… అతడికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:Ambulance In Track: రోడ్డుపై వెళ్లాల్సిన అంబులెన్స్ పట్టాలెక్కింది.. షాక్ లో నెటిజన్లు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వ్యక్తి భయపడకుండా..సమయస్పూర్తితో వ్యవహరించి మృత్యువును జయించాడని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు ఆ వ్యక్తికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయంటూ.. కామెంట్లు పెట్టారు. అయితే రైల్వే అధికారులు.. ఎప్పుడైనా ఇలా ఆగి ఉన్న ట్రైన్ మధ్య నుంచి వెళ్లకూడదని .. అలా వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుననారు.
Man narrowly escaped death as he tried to crawl under goods train to the other side of platform, at Kesamudram Railway Station in Mahabubabad district. pic.twitter.com/DIXvyRkbfz
— Naveena (@TheNaveena) November 15, 2025