Kota Greenfield Airport: రాజస్థాన్‌లోని కోటా-బుండిలో రూ.1,507 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విమానాశ్రయంలో చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతున్నాయని, భవిష్యత్తులో కోటాలో A-321 రకం విమానాలు ల్యాండ్ అయ్యేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం 440.06 హెక్టార్ల భూమిని AAIకి కేటాయించినట్లు పేర్కొన్నారు.
READ MORE: Prabhas : రూ.50కోట్లు ఇచ్చిన ప్రభాస్.. ఎవరికో తెలుసా..?
పాత విమానాశ్రయానికి 23 కిలో మీటర్ల దూరంలో..
కోటాలో కొత్తగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం నుంచి 23 కి.మీ దూరంలో ఉంటుంది. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1000 పీక్ అవర్స్ ప్యాసింజర్లను నిర్వహించగల సామర్థ్యం కలిగిన టెర్మినల్ భవనం నిర్మాణం కూడా ఉందని తెలిపారు. కోటా ఒక పారిశ్రామిక, విద్యా కేంద్రమని, విద్యారంగానికి చెందిన ప్రజలు క్రమం తప్పకుండా కోటాను సందర్శిస్తారని అన్నారు. ఇక్కడ చాలా కాలంగా విమానాశ్రయం కోసం డిమాండ్ ఉందని, ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం పాతది కావడంతో దానికి ఆధునీకరణ అవసరమని అన్నారు. ప్రస్తుత కోటా ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అనుకూలం కాదని, స్థల కొరతతో పాటు పట్టణీకరణ సమస్య ఉందన్నారు. కొత్త విమానాశ్రయంలో 3,200 మీటర్ల రన్‌వే, 7 విమానాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏడాదికి 2 మిలియన్ల ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
భువనేశ్వర్లలో ఆరు లైన్ల రింగ్ రోడ్డు ..
కటక్ – ఒడిశాలోని భువనేశ్వర్లలో రూ. 8,307 కోట్ల పెట్టుబడితో ఆరు లైన్ల రింగ్ రోడ్డు అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఖోర్దా–భువనేశ్వర్–కటక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ వాణిజ్య రవాణాను నగరాల వెలుపలకు మళ్లించవచ్చారు. ఈ ఆరు లైన్ల రింగ్ రోడ్డు 3 జాతీయ రహదారులు (NH-55, NH-57, NH-655), 1 రాష్ట్ర రహదారితో అనుసంధానం అవుతుందన్నారు. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంతో పాటు, ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తూర్పు భారత ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. దీని ద్వారా కొన్ని లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలిపారు.
READ MORE: Deadly Virus Outbreak in Gaza: గాజాలో ప్రమాదకరమైన వ్యాధి.. చికిత్స దాదాపు లేనట్లే..!