CM Revanth Reddy: అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్‌కు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, పరిశ్రమలు రాలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మక్తల్, నారాయణ్ పేట్, కొడంగల్ ప్రాజెక్టు పనులు.. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వలసలు ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Pawan Kalyan: మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు: డిప్యూటీ సీఎం పవన్
కురుమూర్తి స్వామి సాక్షిగా చెబుతున్నా ఈ ప్రాంత బిడ్డగా అన్ని రంగాల్లో పాలమూరును అభివృద్ధి చేస్తా అన్నారు. మాట నిలుపుకొకపొతే చరిత్ర క్షమించదని తెలిపారు.
ఆనాడు హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చిందన్నారు. ఆరు దశబ్దాల తర్వాత ఈ ప్రాంత బిడ్డకు అవకాశం వచ్చింది లక్షలాది పాలమూరు బిడ్డల ఆశీస్సులు, కురుమూర్తి దయ వల్ల ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు. 900 ఏళ్ల చరిత్ర ఉన్న మన ప్రాంత ఇలవేల్పు కురుమూర్తి ఆలయం అన్నారు. వసతులు,కనీస సౌకర్యాలు లేవు.. కురుమూర్తి ఆలయ అభివృద్ధి కోసం పాలమూరు బిడ్డగా బాధ్యత వహించి 110 కోట్లు కేటాయించానని తెలిపారు. పాలమూరు పుణ్యక్షేత్రాలు మన్యం కొండ, కురుమూర్తి ఆలయాల అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నా అన్నారు.
Read also: Kishan Reddy: నగరంలో కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. పాలమూరు వలసలు ఇంకా కొనసాగుతున్నాయి..ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి, మిమ్మల్ని చరిత్ర క్షమించదని తెలిపారు. పాలమూరు జిల్లాలో నిరంతరం పర్యటించకపోయినా సమీక్షలు చేస్తున్నాను, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు. అమరరాజా ఫ్యాక్టరిలో స్థానికులకే అవకాశం ఇవ్వాలని సంస్థను కోరాను, స్థానికులకు 2 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఎడారిగా మారిన పాలమూరు పచ్చదనం కోసం నిధులు కేటాయిస్తాం, జిల్లా అభివృద్ధి పై సమీక్షా నిర్వహిస్తా, ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యాయి.. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. పాలమూరు జిల్లాలో ప్రతి మారుమూల గ్రామానికి బిటీ రోడ్డు వేస్తామన్నారు. పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు.
Applying Ghee: వావ్.. అక్కడ నెయ్యి పూసి మసాజ్ చేస్తే సూపర్ రిజల్ట్..