Madhu Yaskhi: లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదం అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడానికి జాతీయ పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Brs వస్తే.. తెలంగాణలో TRS కి VRS ఇస్తారు జనం అని తెలిపారు. BRS అంటే VRS అని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో TRS మూతి పగలగొట్టాలని తీవ్ర వాఖ్యలు చేశారు. . రాజకీయంగా బొంద పెట్టాలని పిలుపు నిచ్చారు. కాపలా కుక్కలా ఉంటా అని కాటేసే నక్కలా మారిపోయారని విమర్శించారు. సొంత విమానం కొనడం ఏంటి? ఎవడబ్బ సొమ్ము? అని ప్రశ్నించారు.
800 కోట్లు TRS కి ఎట్లా వచ్చాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ గాంధీ ప్రతినిధి కాదు.. గాడ్సే ప్రతినిధి అంటూ విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో TRS మూతి పగల గొట్టాలని మండిపడ్డారు. కవితమ్మ ఎత్తుకునే పూల బతుకమ్మ లోపల లిక్కర్ బాటిల్లే ఉంటాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం కాదని అందరూ చెప్పారు, లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతిని తన నెత్తిన పెట్టుకుంటున్నారు కేసీఆర్ అని ఎద్దేవ చేశారు. BRS కూడా కేసీఆర్ కి VRS లాంటిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. AP లో కొందరు వెలమలను కేసీఆర్ సంప్రదిస్తున్నారని ఆరోపించారు. తన కుల సామ్రాజ్యం పెంచుకోవడమే పని కేసీఆర్ కి అంటూ మండిపడ్డారు. AP ని తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు AP కి ఎలా వెళ్తారు? అని ప్రశ్నించారు. ఉండవల్లిని పండగ భోజనం పెట్టరూ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో కేసు వేశాడని, ఇప్పటికి కేసు ఉందని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మండిపడ్డారు.
Jairam Ramesh: టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్ కాదు.. వారికి వీఆర్ఎస్ తప్పదు..