గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బీర్ కేసులు 23 లక్షలు అధికంగా అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. భానుడి ప్రభావానికి మందుబాబులు బీర్లను ఎక్కువగానే తాగేశారు. అయితే.. గత ఏప్రిల్ లో కన్నా ఈ ఏప్రిల్ లో 420 కోట్ల ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
ఏప్రిల్ నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు 2 వేల 689 కోట్ల 41 లక్షలు కాగా, గతేడాది ఏప్రిల్‌లో మద్యం అమ్మకాలు 2 వేల 269 కోట్ల 67 లక్షలు అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే.. గత ఏప్రిల్ కన్నా ఈ ఏడాది ఏప్రిల్ లో 23 లక్షల 50 వేల బీర్ కేసుల ఎక్కువగా అమ్మకం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతేడాది 26 లక్షల 21 వేల బీరు కేసులు అమ్ముడు కాగా ఈ ఏడాది 49 లక్షల 78 వేల బీరు కేసుల అమ్మకం జరిగినట్లు ప్రకటించింది ఎక్సైజ్ శాఖ.