ఆంధ్రప్రదేశ్‌లోనూ లిక్కర్ సేల్క్ కొత్త రికార్డు సృష్టించాయి.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.. ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 31వ రోజున రాష్ట్రవ్యాప్తంగా రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా.. జనవరి 1వ తేదీకి వచ్చేసరికి దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బీర్ కేసులు 23 లక్షలు అధికంగా అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. భానుడి ప్రభావానికి మందుబాబులు బీర్లను ఎక్కువగానే తాగేశారు. అయితే.. గత ఏప్రిల్ లో కన్నా ఈ ఏప్రిల్ లో 420 కోట్ల ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఏప్రిల్ నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు 2…