మాజీ ప్రియుడిపై పగతో అతని కారులో గంజాయిని పెట్టించి పోలీసులకు పట్టించిందో ప్రియురాలు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణ విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. దీంతో సదరు ప్రియురాలితో పాటు మరో ఏడుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌కు చెందిన లా స్టూడెంట్ తన మాజీ ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది. ఇందుకోసం కొంతమంది వ్యక్తులతో కుట్రకు పన్నాగం పన్నింది.
Also Read: Odisa: ఛీ.. ఛీ.. వీడు అసలు మనిషేనా? కన్నతల్లి అని చూడకుండా దారుణం..
మరో ఏడుగురితో కలిసి తన మాజీ ప్రియుడి కారులో గంజాయిని పెట్టించి.. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిందితురాలు లా స్టూడెంట్ సమాచారంతో బాధితుడి కారును తనిఖీ చేసిన పోలీసుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రియురాలిని విచారించగా ఆమె నిర్వాకం బయటపడింది. చివరిక తానే ఈ పని చేసినట్టు ఒప్పుకుంది. ఇందుకోస మరో ఏడుగురు సాయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రియురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెతో పాటు మరో ఏడుగురు అరెస్ట్ చేసి వారి నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read: Prabhas: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు ‘ఆదిపురుష్’కి పిలుపు