Odisa: ఛీ.. ఛీ.. వీడు అసలు మనిషేనా? కన్నతల్లి అని చూడకుండా దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నతల్లి అంటే కనిపించే దేవత.. బంగారు పల్లకిలో కాకపోయిన భాధ పెట్టకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత.. అలాంటి కన్న తల్లిని ఓ మానవత్వం లేని మృగం అష్ట కష్టాలు పెడుతున్నాడు.. చిన్న దొంగతనం చేసిందని కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టాడు.. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఈ అవమానీయ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా కియోంఝర్ జిల్లాలోని సరస్పాసి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ 70ఏళ్ల శుభద్రకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆమె భర్త 10ఏళ్ల ముందే మరణించాడు. అప్పటి నుంచి.. ఆ వృద్ధురాలు, తన పెద్ద కుమారుడు కరుణతో కలిసి జీవిస్తోంది. చిన్న కుమారుడు శత్రుఘన్.. తన భార్యతో కలిసి వేరుగా జీవిస్తున్నాడు.. రెండో కొడుకు పొలం ఉంది.. అతను కాలిప్లవర్ లను పండిస్తుంటాడు.. ఈ మధ్య కొన్ని కాలి ఫ్లవర్ లను ఎవరో దొంగిలించారు.. ఆ పని చేసింది తన తల్లే అని అనుమానించాడు..
Also Read
వాటిని దొంగలించి, తినేసిందన్న కోపంతో.. ఆమెపై దాడి చేశారు. తొలుత ఆ వృద్ధురాలిని స్తంభానికి కట్టేశాడు. అనంతరం ఆమెను దారుణంగా కొట్టాడు. ఆమె బాధను చూసి విడిపించేందుకు వచ్చిన స్థానికులను కూడా బెదిరించాడు.. మొదట భయపడిన వాళ్లు ఆ తర్వాత ధైర్యం చేసి ఆమెను విడిపించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ఆ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని తెలుస్తుంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.. ఈ దారుణానికి పాల్పడిన అతన్ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..
- Tags
- Latest Crime News
- Odisha
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!