మాజీ ప్రియుడిపై పగతో అతని కారులో గంజాయిని పెట్టించి పోలీసులకు పట్టించిందో ప్రియురాలు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణ విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. దీంతో సదరు ప్రియురాలితో పాటు మరో ఏడుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌కు చెందిన లా స్టూడెంట్ తన మాజీ ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది. ఇందుకోసం కొంతమంది వ్యక్తులతో కుట్రకు పన్నాగం…