వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.
టాలీవుడ్ నటుడు రణధీర్‌రెడ్డిని గన్‌తో బెదిరించారు భూ కబ్జాదారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో తుపాకీ కలకలం రేపింది. నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో భూ కజ్జాదారులు బెదిరించారు. హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారు రణధీర్‌రెడ్డి. అయితే, భూమి చదును పనులు చేయిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.. గన్‌లోడ్ చేసి చంపుతానంటూ రణధీర్‌రెడ్డిని…