హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది.
Minister Savitha: కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడికెళ్లినా సమస్యలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగింది.. గతంలో పులివెందులకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నీటి ప్రాజెక్టుల పనులు ఇప్పుడు చేపడుతున్నాం.
భూకబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు.. రైతుల నుంచి వినతులు స్వీకరించారు..
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్ను చిత్రహింసలకు గురిచేశారు…
టాలీవుడ్ నటుడు రణధీర్‌రెడ్డిని గన్‌తో బెదిరించారు భూ కబ్జాదారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో తుపాకీ కలకలం రేపింది. నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో భూ కజ్జాదారులు బెదిరించారు. హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారు రణధీర్‌రెడ్డి. అయితే, భూమి చదును పనులు చేయిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.. గన్‌లోడ్ చేసి చంపుతానంటూ రణధీర్‌రెడ్డిని…