టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయిన కూడా ఎప్పుడు చూసిన ఫ్రెష్ ఫీలింగ్ కలిగే విధంగా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు ..అంతలా తన టేకింగ్ తో ఆయన మ్యాజిక్ చేస్తారు.అంతా కొత్తవారితో ఆయన తీసిన “హ్యాపీ డేస్” అప్పట్లో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమా ఎప్పుడు చూసిన కూడా వెంటనే మన కాలేజీ డేస్ గుర్తుచేస్తుంది..శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇదిలా ఉంటే “హ్యాపీ డేస్” సినిమా మళ్ళీ థియేటర్స్ కు రానుంది. అప్పట్లో ఈ సినిమాను థియేటర్స్లో మిస్ అయిన వారందరు ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు .తాజాగా హ్యాపీ డేస్ సినిమా ఏప్రిల్ 19న రీ రిలీజ్ కానుంది.హ్యాపీ డేస్ సినిమా రీ రిలీజ్ కావడం అలాగే దర్శకుడిగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఎప్పుడు చూసిన ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగేలా హ్యాపీ డేస్ ను తెరకెక్కించాము.ఈసినిమాకు మ్యూజిక్ ప్రాణం పోసింది.అయితే ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను రీసెంట్ గా హ్యాపీ డేస్ మూవీని మళ్లీ చూశాను. కానీ సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంది. ప్రస్తుతం హ్యాపీ డేస్ రీరిలీజ్ యూత్‌కు ఓ పండగలా ఉందని ఆయన తెలిపారు.హ్యాపీ డేస్ సీక్వెల్ గురించి అడగగా ..సీక్వెల్ చేయాలనీ నాకు అనిపించింది. కానీ కథ ఫామ్ కాలేదు. హ్యాపీడేస్ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లు అయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి .స్టూడెంట్స్ థింకింగ్ కూడా మారిందని ఆయన తెలిపారు .శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో అద్భుతమైన మూవీ లీడర్ అప్పటి రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన లీడర్ సినిమా సూపర్ హిట్ అయింది ..లీడర్ సీక్వెల్ ఫై శేఖర్ కమ్ముల పాజిటివ్ గా స్పందించారు .లీడర్కు సీక్వెల్ తీయాలని మైండ్‌లో ఉంది. కానీ సమయం అస్సలు కుదరడంలేదు. చేస్తే తప్పకుండా మళ్లీ ఆ సినిమా రానా తోనే చేస్తా. అప్పట్లో ఆ సినిమాలో లక్ష కోట్లు అవినీతి అంటే చాలా ఎక్కవ అని అన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు మరింత దిగజారిపోయాయి. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుందనీ ఆయన తెలిపారు.