Chilkur Balaji Temple: చిలుకూరు ఆలయానికి క్యూ కట్టిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ప్రసిద్ధ దేవాలయం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో కలియుగ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవం నిన్నటితో ప్రారంభమయ్యాయి. బాలాజీ ఆలయంలో ఏటా వారం రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా తొలిరోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల రోజున ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు. ఈరోజు గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు.
Read also: Google Doodle: లోక్‌సభ పోల్స్ నేపథ్యంలో ఎన్నికల చిహ్నంతో గూగుల్ డూడుల్..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
అనంతరం సంతానం లేని మహిళలకు ఈ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ ఉంటుంది. అయితే ఈ ప్రసాదాన్ని కేవలం మహిళలకు మాత్రమే పంచుతారు. అయితే ఆ ప్రసాదం కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు తమ బైక్‌లు, కార్లను పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్తున్నారు.
Read also: CM Revanth Reddy: నేడు మహబూబాబాద్ జన జాతర సభకు సీఎం రేవంత్‌రెడ్డి..
ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా శ్రీరామ నవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తారు. గురువారం (ఏప్రిల్ 18) సెల్వర్ కూత్తుతో అంకురార్పణ చేశారు. అయితే.. ముందుగా పుట్టమన్ను తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈరోజు (19వ తేదీ) ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించనున్నారు. రేపు (20న) స్వామివారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహించనున్నారు.
Read also: Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
ఎల్లుండి (21న) సూర్యప్రభ వాహనం, గరుడవాహనం సేవలు.. అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం ఊరేగింపు ఉంటుంది. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వహన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. చివరి రోజైన 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు.
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!