తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అరవింద్ ఆర్యను మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన…
చారిత్రక వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ…