KTR : ఎక్కడ కూల్చేశారో.. అక్కడే గృహప్రవేశం చేయిస్తాం..
- వెలుగుమట్లలో కూల్చివేతలను సందర్శించిన కేటీఆర్
- బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి
- ప్రభుత్వంపై అమానుష చర్యల ఆరోపణలు
- న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న హామీ
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెండు రోజుల క్రితం రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్‌ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, తమకు గూడు లేకుండా చేసిందని వారు కేటీఆర్‌కు వివరించారు. బాధితుల మాటలను ఓపికగా విన్న ఆయన, వారికి ధైర్యం చెప్పారు.
Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేయడం, వారి గుడిసెలను పీకేయడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం పేదల పక్షాన ఉండాల్సింది పోయి, వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వెలుగుమట్ల ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. కేటీఆర్ స్వయంగా కూల్చివేతలకు గురైన గుడిసెల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Epstein Files: బికినీ బేబీలతో స్టీఫెన్ హాకింగ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం..
- Tags
- BRS Party
- khammam
- ktr
- Velugumatla
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!