YSR Matsyakara Bharosa Scheme: మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది.. మొత్తం 123.52 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.. దీంతో పాటు కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్లతో ఆర్ధిక సహాయం చేయనున్నారు.. ఓఎన్‌జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు కూడా సాయం చేయనున్నారు.. మొత్తం రూ. 231 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్ల జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం.. నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు. ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు బాపట్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉదయం 11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు.