Komatireddy Venkat Reddy: కేటీఆర్కు కోమటిరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనలకు పిలుపునిచ్చారు. వారి విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
Read also: Fast Eating: ఫాస్ట్ గా తింటున్నారా? మీ ప్రాణాలు గోవిందా..
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
తాజాగా ఎంపీ కోమటిరెడ్డి ఐటీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో సబ్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడి లాగ్ బుక్ లో రైతులకు అందుతున్న ఉచిత కరెంట్ వివరాలను పరిశీలించారు. 10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్ అందడం లేదు. అంటే, కేటీఆర్ చెప్పేవి అబద్ధాలేగా!!అన్నారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని గుర్తు చేశారు. సబ్ స్టేషన్ లో పని చేస్తున్న బాల నర్సయ్యను జీతం రాకుండా ఎలా బతుకుతున్నారని అడిగితే.. అప్పులు చేస్తున్నామని అన్నారని అన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ఒకసారి బాల నర్సయ్య బాధలు వినాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ కు పెరిగిన ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని మండపడ్డారు. దేశంలో ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
థాక్రే ఢిల్లీలో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్ హామీని పెడతామని స్పష్టంగా చెప్పారు. ఇకనైనా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నాటకాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండే రెండు నెలలు సక్రమంగా పాలన సాగించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే 10 గంటల కరెంట్ 10 సార్లు పోతోందని మండిపడ్డారు. దానికే 24 గంటల కరెంట్ అని చెప్తారా? అని ప్రశ్నించారు. త్రీ ఫేజ్, సింగిల్ ఫేజ్ కు సంబంధించిన వివరాలు లాగ్ బుక్ లో ఉన్నాయి. కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని కోమటిరెడ్డి వెల్లడించారు. రేపు పీసీసీని కలిసి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రాజకీయ లబ్ది కోసం బీఆర్‌ఎస్ ఈ విషయాన్ని ప్రచారం చేస్తోందని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
AP v/s TS: మమల్ని రెచ్చగొట్టద్దూ.. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు సీరియస్..
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!