ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అమ్మడు ఏ మాయ చేసిందో ఏమోగానీ… టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఆమె మాయలోనే ఉన్నట్టు, గ్యాప్ లేకుండా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. అది కూడా బడా బడా హీరోయిన్లను సైతం మధ్యలోనే తప్పించి మరీ… అమ్మడికి ఆఫర్లు ఇస్తున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీగా… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది శ్రీలీల. ఆమె చేతిలో ఏకంగా పది సినిమాలకు పైగానే ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి టాప్ ప్లేస్ వెళ్లేందుకు రెడీ అవుతోంది శ్రీలీల. మహేష్ బాబు గుంటూరు కారంలో.. ముందుగా శ్రీలీలను సెకండ్ లీడ్‌లో, పూజా హెగ్డేని మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మధ్యలోనే పూజా హెగ్డేని పక్కకు పెట్టేసి… శ్రీలీలకు లీడ్ రోల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు ఏకంగా మరో స్టార్ బ్యూటీ రష్మికకు కూడా చెక్ పెట్టేసినట్టే ఉంది శ్రీలీల. వెంకీ కుడుమల, నితిన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను అనుకున్నారు కానీ ఇప్పుడు రష్మిక తప్పుకుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇతర కమిట్మెంట్స్ వల్ల నితిన్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకుందట రష్మిక. కారణం ఏదైనా.. ఇప్పుడు రష్మిక ప్లేస్‌లో శ్రీలీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇందులో నిజమెంతో తెలియదు గానీ రష్మికనే డేట్స్ అడ్జెస్ట్ చేయలేదంటే మరి ఆమె కంటే బిజీగా ఉన్న శ్రీలీల, నితిన్‌కు డేట్స్ ఇస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా గోల్డెన్ గర్ల్ గా శ్రీలీలా మరో మూడు నాలుగేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ లోపు సాలిడ్ హిట్స్ పడితే ఈ కన్నడ బ్యూటీ టాప్ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.