బస్తీవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్, కుమ్మరివాడి, మెహదీపట్నం జిభాబాగ్ లో పవర్ బోర్ లను ప్రారంభించారు. హోటల్ నీలోఫర్ టీ తాగిన కేంద్రమంత్రి ,.. కుండల తయారీనీ పరిశీలించిన కిషన్ రెడ్డి.. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్ నీలోఫర్ హోటల్ ముందు పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక నరసింహ స్వామి టెంపుల్ లో స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత స్థానిక నాయకులతో కలిసి “హోటల్ నీలోఫర్ లో టీ” తాగారు. అనంతరం కుమ్మరివాడిలో పవర్ బోర్ ను ప్రారంభించారు.
Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి
అక్కడ కుండలను తయారు చేస్తున్న స్థానిక కుమ్మరులతో మాట్లాడారు. కుండల తయారుచేసె విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు అప్పటికప్పుడు కుండలను తయారు చేసి కేంద్రమంత్రికి చూపించారు. ఈ సందర్బంగా వారు తయారు చేసిన మట్టి వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మెహదీపట్నం జిబాగ్ బస్తీల్లో పవర్ బోర్ లను ప్రారంభించారు. ఈ సందర్బంగా పాతబస్తీపై గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయని అన్నారు . రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
MP Mithun Reddy: ఎంపీగా ఇవే నా చివరి ఎన్నికలు!.. ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు