తెలంగాణ పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో పత్తి సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. రైతులకు సజావుగా, ఇబ్బందులు లేకుండా పత్తి సేకరణ జరిగేలా కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది తెలంగాణలో ఉత్పత్తి అయిన పత్తిలో దాదాపు 80 శాతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొనుగోలు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రైతులకు చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని, ఇది పారదర్శకతను పెంచి అవినీతికి తావు లేకుండా చేస్తుందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కూడా ఆయన అభ్యర్థించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు తగ్గినా, భారత రైతులకు నష్టం కలగకుండా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించకుండా ఉండాలని, కేంద్రం పూర్తి అండగా ఉంటుందని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం పత్తి కొనుగోలు సమయంలో జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పడే రద్దీని తగ్గించేందుకు కేంద్రం కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులకు సమయ స్లాట్లను కేటాయించి సజావుగా సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇది ఆలస్యాన్ని నివారించడమే కాకుండా మధ్యవర్తుల జోక్యాన్ని కూడా తగ్గిస్తుందని వివరించారు.
Fake PMO Letter Scam: చీటింగ్ చేయడం కోసం ప్రధాని కార్యాలయాన్ని వాడుకున్న వ్యక్తి.. కట్‌చేస్తే..
పత్తి సేకరణ కేంద్రాలకు తేమ శాతం తక్కువగా ఉండేలా పత్తిని తీసుకురావాలని, రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. పత్తిని ఎండబెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం MGNREGA నిధులను వినియోగించుకోవచ్చని తెలిపారు. అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తనాల వాడకం రైతుల ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుతుందని కేంద్రం సిఫార్సు చేసినప్పటికీ, రాష్ట్రం ఈ విత్తనాలను ఇంకా అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 122 కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, రైతు కమిటీలు తక్షణ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. తేమ శాతం కొలవడానికి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి సేకరణలో ప్రతి దశలో పారదర్శకత, న్యాయం ఉండేలా చూడాలని సూచించారు. రైతులు 12 శాతం కంటే తక్కువ తేమ ఉన్న పత్తిని తీసుకురావాలని, అయితే తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉన్న పత్తిని తిరస్కరించకుండా మార్గనిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు.
Gold Rate Today: రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తున్న బంగారం.. ఇవాళ రూ. 1150 పెరిగిన గోల్డ్ ధర