తెలంగాణ పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో పత్తి సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. రైతులకు సజావుగా, ఇబ్బందులు లేకుండా పత్తి సేకరణ జరిగేలా కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణలో ఉత్పత్తి అయిన పత్తిలో…
Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సమస్యలపై సీసీఐ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు.