బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి పసిడి ధరలు. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 1150 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 తగ్గింది. తులం పుత్తడి ధర రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,317, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,290 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1050 పెరిగింది.
Also Read:Megastar : క్లాస్ లుక్ లో మన ‘మెగాస్టార్’ చిరు లేటెస్ట్ ఫొటోస్
దీంతో రూ.1,12,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగింది. దీంతో రూ. 1,23,170 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,320 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,67,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,57,000 వద్ద ట్రేడ్ అవుతోంది.