Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్‌కు విచ్చేస్తున్న బీజేపీ నేతలకు స్వాగతం పలుకు బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రధాని మోడీని బీజేపీని విమర్శిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ ల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదంటూ ఆరోపణలు గుప్పించారు. మా బ్యానర్ లు తీసేశారన్నారు.
అంతేకాకుండా.. ఇటీవల మంత్రి కేటీఆర్ ‘ఆవో-దేఖో-సిఖో’ అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మీ నుండి నేర్చుకోవాల్సింది… బాప్ బేటా పాలన, నియంతృత్వ పాలన నేర్చుకోవాలా అంటూ మండిపడ్డారు. కేసీఆర్, ఎంఐఎం కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటోందని, 8 సంవత్సరాల నుండి సెక్రటేరియట్‌కు రాలేదు… నెలకు 20 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటాడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. డైనింగ్ టేబుల్ మీద జరిగే మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్ అంటూ ఎద్దేవా చేశారు. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ వేసుకొని నేరుగా సీఎం బెడ్ రూం వరకు వెళతాడంటూ విమర్శలు గుప్పించారు. ప్రధానికి వ్యతిరేకంగా కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
తాజావార్తలు
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్‌ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్‌ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?