Kishan Reddy: “వినాశ కాలే విపరీత బుద్ధి” అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy condemned the arrest of Bandisanjay: వినాశ కాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని అంబర్‌పేట్‌లో 6 నెంబర్ వద్ద ఫ్లైఓవర్ పనులను అధికారలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అభద్రతాభావంతో ఉందని విమర్శించారు. అధికారం నుండి మా కుటుంబం దూరమవుతుందని అభద్రతతో సీఎం కేసీఆర్ ఉన్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నిరాశ నిస్పృహతో ఉన్నారని విమర్శించారు.
అబద్ధాలు మాట్లాడుతూ విష ప్రచారాలు రాష్ట్రప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రెచ్చగొట్టు పాదయాత్రను అడ్డుకోండని పిలుపునిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలనను దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిన్న జరిగింది సింబాలిక్ ప్రొటెక్ట్ మాత్రమే అని, ఎవరింటికి ఎవరు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న పాదయాత్రను ఆపి అరెస్టు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండిస్తున్నామన్నారు. ఒక అభద్రతాభావంతో అధికారం చేయి జారిపోతుందన్న భయంతోనే బండి సంజయ్, రాజాసింగ్ లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వినాశ కాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తులు లభిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
The crowd crushed the thief: దొంగకు దేహశుద్ధి.. ఎందుకో తెలుసా?
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!