దొంగలు తమ బుద్ధి మానుకోరు.. పోలీసులు పట్టుబడి.. మళ్ళీ బయటకి వచ్చాక పాత వృత్తిని వదులుకోరు. కిరాణా దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బీహార్ దొంగకి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకాపురం గ్రామంలో చుటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన శివకుమారి అనే మహిళ కిరాణా షాపు నిర్వహిస్తోంది.ఇదే షాపులో మద్యం సీసాలు కూడా విక్రయిస్తుండగా జామాయిల్ బాదులు నరికేందుకు బీహార్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ కూలీ ప్రతి రోజు ఆ కిరాణా దుకాణానికి వచ్చి మద్యం సేవించేవాడు.
ఈ క్రమంలోనే. తరుచూ వచ్చే ఆ దొంగ అదును చూసి ఆదివారం రాత్రి ఇదే షాపులో చోరీకి పాల్పడి సుమారు రూ.35వేల రూపాయాల నగదు, రూ.14వేల విలువగల మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లను అపహరించుకుపోయాడు.. అయితే సోమవారం కూడా సదరు వ్యక్తి అదే కిరాణా షాపుకు వచ్చి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండటంతో మహిళకు అనుమానం వచ్చి స్థానికులకు చెప్పడంతో వారంతా కలిసి ఆరా తీస్తే వలస కూలే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
దాంతో ఆగ్రహంతో ఆ దొంగను నిలదీయడంతో షాపులో చోరీ చేశానని ఒప్పుకున్నాడు.. చోరీకి పాల్పడిన వ్యక్తి వద్ద నుండి దొంగిలించిన మద్యం సీసాలు,డబ్బులు స్వాధీనం చేసుకొని ఆ దొంగని స్థంబానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. నెలరోజుల క్రితం మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో ఇదే తరహాలో ఓ కిరాణా దుకాణంలో 35 వేలు నగదు, 1,50,000/- విలువ చేసే మద్యం సీసాలు దొంగతనం జరిగాయి, అదే వినాయకపురం లో ఓ రెస్టారెంట్ లో నెల రోజుల వ్యవధిలో నాలుగు లక్షల రూపాయల మద్యం దొంగిలించారు…అలా కొన్ని దొంగతనాలు జరగడంతో దుకాణ యజమానులు భయాందోళనకు గురవుతున్నారు..