Minister Komatireddy: ఖమ్మం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ కారణంగా ఆలస్యంగా వచ్చానన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని తెలిపారు. అక్రమాలు జరుగకుండా చూడాలన్నారు. భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్ అవుతారు.. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు మీ ఇళ్లు అనుకుని పని చేయండి అని మంత్రి సూచించారు.
Read Also: Ponnam Prabhakar: వేములవాడలో రూ.35 కోట్లతో అన్నదానం సత్రం నిర్మాణం
అలాగే, ప్రజా పాలనలో ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు అని రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వారి కోసం ఒక్కొక్కటిగా పని చేసి పెడుతున్నాం.. ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.. దానికి మంత్రులు, అధికారులు అందరు హాజరయ్యారు.. ప్రతి అర్హుడైన పేదవాడికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అర్హుడైన ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తాం.. రెవెన్యూ మంత్రి కూడ ఖమ్మం జిల్లాకు చెందిన వాడే ఆయన దగ్గర ఉండి మరి మీకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారు.. 16 నుంచి 26 వరకు అధికారులు కష్టపడి, ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేయాలి.. పేదలకు ఇళ్లు అందేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.