Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. నల్లగొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహాకులను మంత్రులు ప్రశంసించారు. అనంతరం జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి ఎంపీలు, ఎంఎల్ఏలు, అధికారులు హాజరయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాహుల్ గాందీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు.
గత ప్రభుత్వ అసమర్ధత, అవినీతి వల్ల 50 వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా పని చెయ్యాలన్నారు. సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదని తెలిపారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు. అధికారం కోల్పోయి కొంతమంది.. అధికారం కోసం కొంతమంది రైతులను ఇబ్బదలకు కూడా చేస్తున్నారని తెలిపారు. అధికారుల దయ వల్ల వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వం వైపు నుండి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు.
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం..