Deputy CM Bhatti: అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంఛార్జ్ మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందజలో ఉంది.. వారం రోజుల్లో నగదు కూడా వారి అకౌంట్ కి వేశాం.. గతంలో 2, 3 నెలలు అయిన నగదు వేసేవారు కాదు అని ఆరోపించారు. దీనికి అధికారులకు అభినందనలు.. అలాగే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి.. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలతో ఇళ్లు శాంక్షన్ చేశాం.. నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం గొప్ప విషయం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మంత్రి కసరత్తు చేస్తున్నారు.. 4 లక్షల 56 వేల ఇళ్లకు నిర్మాణాలు చేపడుతున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. గాయపడిన వృద్ధురాలిని..!
అలాగే, సీజన్ మొదలైంది కాబట్టి విత్తనాల పంపిణీ మంచిగా జరగాలి.. నకిలీ విత్తనాలు అమ్మేవారికి జిల్లాలో పుట్టగతులు ఉండవు అని ఉప ముఖ్యమంత్రి భట్టి వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ఇక, ధరణి పోర్టల్ ను పదేళ్లు చూశాం.. ధరణిలో బంధించిన వాటిని బయటకు తీసుకుని వచ్చేది, ప్రజలకు సరళమైన, న్యాయమైన హక్కులన్నింటినీ కాల రాసిన చట్టం ధరణి అని ఆరోపించారు. ధరణినీ తొలగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం, దానికి తగ్గట్టుగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కసరత్తు చేశారు.. అందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం పేదలకు అనుకూలంగా ఇది పని చేస్తుందని డిప్యూటీ సీఎం విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!
ఇక, తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి అన్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి.. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి లిస్ట్ మొత్తం ఇంఛార్జ్ మంత్రికి అప్పగించాలి అని సూచించారు. అధికారులు ఎక్కడ కూడా ఉదాసీనత వ్యక్త పర్చొద్దు.. గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని విభాగాలను గాలికి వదిలి వేసింది.. బడ్జెట్ పరంగా ఏ ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిగా నిధులు విడుదల చేస్తామన్నారు. సీజన్ వ్యాధులకు సంబంధించి కలెక్టర్లు సీరియస్ గా పని చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.