భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్, టాలెంట్ కి హైదరాబాద్ కి కేంద్రంగా మారింది అన్నారు.
బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు.
Deputy CM Bhatti: గత ప్రభుత్వం హయాంలో రైతులు వాడిన విద్యుత్ కు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిన వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించి.. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి.. 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయని తేల్చి చెప్పారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలతో ఇళ్లు శాంక్షన్ చేశాం.. నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం గొప్ప విషయం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మంత్రి కసరత్తు చేస్తున్నారు.. 4 లక్షల 56 వేల ఇళ్లకు నిర్మాణాలు చేపడుతున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు.
మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం…
Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మనది ప్రజలందరిది.. తాడిత, పీడిత, దళిత, గిరిజన అణగారిన వర్గాలు నోరు లేనటువంటి వారికి గొంతుకగా నిలిచేదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన…